In Telugu
‘‘ఊరకరారు మహాత్ములు” అంటాడు పోతన శ్రీమద్ ఆంధ్ర మహాభగవతంలో ఒక మట్టంలో. అట్లాటి మహీతాత్ముడే కృష్ణాజీ అనీ జేకే అనీ పేరు పొందిన జిడ్డు కృష్ణమూర్తి.
కృష్ణాజీ
మన మదనపల్లెలో నారాయణయ్య ఇంట సంజీవమ్మ కడుపున ఎనిమిదవ పంటగా పూజగదిలో 1895 మే 11న పుట్టిన ఈ కృష్ణుని అదృశ్యమూర్తిని చూచిన వాడు మదరాసు సముద్రతీరాన నెలకొన్న ధియొసాఫికల్ సొసైటీకి చెందిన లెడ్‌బీటర్ అన్న పాశ్చాత్య యోగి. మదరాసు రేపల్లె అయింది; ఆనీబిసెంటమ్మయశోద

